NDL: కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉపాధి హామీ చట్టం కాపాడుకునేందుకు కూలీలంతా ఐక్యం కావాలని ఏపీ వ్యాకాస జిల్లా అధ్యక్షులు ఎం. నాగేశ్వరావు పిలుపునిచ్చారు. ఇవాళ నంది కొట్కూరు మండలం, బిజినవేములలో పర్యటించారు. కేంద్ర బీజేపీ ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయడం జరిగిందని చెప్పారు. దీనికి రాష్ట్రంలోని పార్టీలు సపోర్ట్ చేయడం ద్రోహమే అన్నారు.