కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీయ నగర్ అక్కయపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7,00,550ల నగదు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్, వై-ఫై రూటర్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డి వెల్లడించారు.