NGKL: జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మంగళవారం జరిగే 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.