AP: ఈఏపీసెట్-2026 ఫలితాలు జూన్ 3వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇంటర్ విద్యార్థులకు నిర్వహిస్తోన్న సప్లిమెంటరీ, బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఈనెల 5తో ముగుస్తాయి. వీటి వాల్యుయేషన్‌కు కనీసం 10 రోజులు పడుతుంది. వీటి రిజల్ట్స్ తర్వాత ఓవరాల్‌గా 25% వెయిటేజీ మార్కులు కలిపి EAPCET ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈఏపీసెట్‌కు 3.29 లక్షల మంది హాజరయ్యారు.