VSP: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సోమవారం జ్ఞానాపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అన్ని పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.