గుంటూరు నగరపాలక సంస్థ (GMC)కు UNIDO జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు లభించింది. విజయవాడలో జరిగిన ‘సస్టెనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్’ ముగింపు వర్క్‌షాప్‌లో కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా కమిషనర్ మయూర్ అశోక్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు GMC బాధ్యతను మరింత పెంచిందని కమిషనర్ తెలిపారు.