CTR: మలేరియా మాసోత్సవాలలో భాగంగా సోమవారం పుంగనూరు పట్టణం కొత్తపేట అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మేలుపట్లలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు అందజేసి అవగాహన కల్పించారు. దోమలు పుట్టకుండా.. కుట్టకుండా.. జాగ్రత్తలు వహించాలని సూచించారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.