NZB: జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా కంఠేశ్వర్లోని రైల్వే కమాన్ వద్ద మరమ్మతుల కారణంగా రాకపోకలు నిలిచి పోయిన విషయం తెలిసిందే. రైల్వే కమాన్ వద్ద టన్నెల్ నిర్మాణం పనులు చేపట్టడంతో సుమారు నెలరోజులకు పైగా ఈ అంతరాయం కలిగింది. అయితే టన్నెల్ మరమ్మతు పనులు పూర్తి కావడంతో సోమవారం రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.