VZM: ఇటీవల పెంచిన ఇంధన ధరలను వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్లు ఆటోను తాళ్లతో లాగుతూ సోమవారం పట్టణంలో వినూత్న నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా CITU నాయకుడు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. ఆటో వర్కర్లు పడుతున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు, మోటార్ వాహన చట్టం, ఫ్రీ బస్సుల వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓలా, ఉబర్, రాపిడో ఉపాధి పోయిందన్నారు.