KDP: మైదుకూరు మండలంలోని పాతపాలెం గ్రామంలో 15 ఏళ్ల దండుబోయిన వర్ధన్కుమార్ అదృశ్యమయ్యాడు. వేసవి సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు గురువారం ఉదయం బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 9121100618, 9121100619 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.