ఖమ్మం నగరంలో మురుగు వ్యర్థాల నిర్వహణకు ఏర్పాటు చేసిన FSTP ప్లాంట్ మంచి ఫలితాలు ఇస్తోంది. సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించే వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయడంతో భూగర్భ జలాల కాలుష్యం తగ్గుతోందని అధికారులు తెలిపారు. నగర పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.