SDPT: జగదేవ్పూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఐలయ్య బదిలీ కావడంతో సర్పంచ్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐలయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలు, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ మరువలేనివని కొనియాడారు.