ATP: శెట్టూరు మండలం యరబోరెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సీఎం సహాయనిధి ద్వారా 11 మంది బాధితులకు రూ.12.42 లక్షల చెక్కులు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీటి సమస్యకు 2 బోర్లు వేయించి పరిష్కరించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం, సీసీ రోడ్లు, మర్రిస్వామి కొండకు రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.