GDWL: పేద ప్రజల సొంతింటి కల ప్రజాపాలనలోనే సాధ్యమవుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 160 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను ఆయన చేతులమీదుగా పంపిణీ చేశారు.