HNK: వేలేరు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు సర్వీసును నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ బస్సు సర్వీస్ వేలేరు, ఇతర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.