HYD: తెలుగు విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. శిల్పం, చిత్రలేఖనం, జ్యోతిష్యం, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, యోగా, ఇంద్రజాలం, పద్య నాటకం కోర్సులున్నాయి.