KMR: పిట్లంలో జొన్నల కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్యేలు అరుణ తార, యెండల లక్ష్మీనారాయణ హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున జొన్నలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, అన్నదాతలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.