KMR: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో పిట్లం మండలం జగదాంబ తండాకు చెందిన యువకుడు హలావత్ భరత్ కుమార్ ప్రతిభ కనబరిచాడు. జాతీయ స్థాయిలో 1,275వ ర్యాంక్ సాధించి మండల కీర్తిని చాటాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, కష్టపడి చదివి ఈ ఘనత సాధించడంపై స్థానికులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భరత్ కుమార్ను పలువురు అభినందించారు.