టోక్యోలో జరిగిన యానిమే అవార్డ్స్‌లో పాల్గొన్న నటి రష్మిక మందన్న, అనంతరం తన జపాన్ పర్యటన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అక్కడ ఆమె సాంప్రదాయ జపనీస్ దుస్తులు ధరించి ఆకట్టుకుంది. అయితే, ఈ ఫోటోల్లో ఆమె భర్త విజయ్ దేవరకొండను కనిపించకుండా దాచేసింది. దీంతో అభిమానులు “ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసు” అంటూ నెట్టింట జోరుగా కామెంట్లు పెడుతున్నారు.