SRPT: నడిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న చందా వెంకన్న సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. రెండు దశాబ్దాలుగా విద్యుత్ శాఖలో అంకితభావంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందిన ఆయన, ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.