ఆసిఫాబాద్ మండలంలోని కౌటగూడ గ్రామంలో పిడుగు పాటుతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం పరామర్శించారు. మృతదేహాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించి, ఆర్ధిక సహాయం చేశారు.