E.G: రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన పలువురి లబ్ధిదారులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం ఒక పండుగలా నిర్వహిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తుందని పేర్కొన్నారు.