NLG: చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డ్ శివనేనిగూడెంలో ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో రైతులు, వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ప్లాంట్ పనిచేయక త్రాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కొందరు చిట్యాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, వెంటనే ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించి సమస్యను తీర్చాలని అక్కడి స్థానికులు కోరారు.