PPM: మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన డబ్బులు – మన లెక్కలు’ కార్యక్రమంపై సోమవారం జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని వెంగాపురంలో ప్రారంభించారు.