SDPT: బెజ్జంకిలోని బస్టాండ్ ప్రాంతంలో గత నెల రోజులుగా ప్రయాణికులకు ఉచితంగా అంబలి పంపిణీ చేసి సేవలందించిన వార్డు మెంబర్ లోనే నర్సింగ్ రావును శ్రీ లక్ష్మీనరసింహ ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా చేసిన సేవలను యూనియన్ సభ్యులు అభినందించారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని ఆకాంక్షించారు.