GNTR: యామర్రు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు.