E.G: కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన బొడ్డేటి నాగదేవికి రూ.30,655, వెస్ట్ గోనగూడెం గ్రామానికి చెందిన కాడ్రెగుల గణపతికి మంజూరైన రూ.50,250 విలువైన CMRF చెక్కులను రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సోమవారం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.