TG: రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్ర ఎండల నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగించింది. వర్సిటీ పరిధిలో ఉన్న అన్ని యూజీ, పీజీ కళాశాలలకు సెలవులను మరో వారం రోజులు పొడిగించింది. మే 31తో ముగియాల్సి ఉండగా.. జూన్ 6 వరకు కొనసాగించాలని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కళాశాలల్లో జూన్ 8 నుంచి సాధారణ విద్యా కార్యకలాపాలు పునఃప్రారంభిస్తామన్నారు.