కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును ఇవాళ అందజేశారు. ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు.