W.G: అధిక ఉష్ణోగ్రతల వల్ల వాయిదా పడిన ఎంటీయూ 1318 రకం విత్తనాల అమ్మకాలను సోమవారం నుంచి తిరిగి ప్రారంభించినట్లు మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ సహ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాస్ తెలిపారు. విత్తనాలు కావలసిన రైతులు ఉదయం 9:00 నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశోధన సంస్థలో కొనుగోలు చేయవచ్చని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.