VKB: జిల్లా డీఈవోగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న రేణుకాదేవి బదిలీ అయ్యారు. జిల్లాలో 6 సంవత్సరాలకు పైగా ఐదు మంది కలెక్టర్ల హయాంలో జిల్లా విద్యాధికారిగా రేణుకాదేవి సమర్థవంతంగా విధులు నిర్వహించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. రేణుకా దేవిని మేడ్చల్ డీఈవోగా బదిలీ చేస్తూ విద్యా శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.