AP: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు.