సోషల్ మీడియాలో నటీమణులపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ తీవ్రంగా మండిపడింది. ముఖ్యంగా కేన్స్ వేడుకల్లో ఐశ్వర్యరాయ్ రూపం, దుస్తులపై కామెంట్లు చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 ఏళ్లుగా దేశానికి గర్వకారణంగా నిలిచిన ఐశ్వర్య స్థాయిని ఇలాంటి వ్యాఖ్యలు తగ్గించలేవని పేర్కొంది. రూపం చూసి విలువ కట్టడం యువతకు తప్పుడు సందేశం ఇవ్వడమేనని చెప్పింది.