అన్నమయ్య: సత్యసాయి జిల్లాకు చెందిన రైతు రెడ్డెప్ప రెడ్డి బి. కొత్తకోటలో ఎర్రగడ్డల డబ్బు వసూలు చేసుకొని వస్తుండగా కారు ఢీకొని మరణించారు. ఆయన జేబులోని రూ. లక్ష నగదును ములకలచెరువు 108 సిబ్బంది మధుసూదన రెడ్డి నిజాయతీతో వారి కుటుంబానికి అందజేశారు. ఈ సంఘటన 108 సిబ్బంది నిజాయితీని చాటింది.