నల్గొండ కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను ఇకపై ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా క్రీడలు, యువజన సేవల శాఖ అధికారి ఎండీ అక్బర్ అలీ తెలిపారు. స్విమ్మింగ్ పూల్ ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.