VZM: గరివిడి మండలం అర్థమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు సకాలంలో అందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు.