TPT: ఈ నెల 9, 10 తేదీలలో డక్కిలి మండలం దగ్గవోలు గ్రామ దేవత పోలేరమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 9వ తేదీ మంగళవారం ఘటోత్సవం, 10వ తేదీ బుధవారం రాత్రికి అమ్మవారి నిలుపు, 11వ తేదీ గురువారం అమ్మవారిని సాగనంపు కార్యక్రమం వైభవంగా జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గ్రామస్థులు కోరారు.