అన్నమయ్య: మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టమాటా మార్కెట్టుకు రైతులు 1,156 మెట్రిక్ టన్నుల టమాటాలను తీసుకువచ్చారని మార్కెట్ సెక్రటరీ జగదీశ్, ఛైర్మన్ శివరాం తెలిపారు. నాణ్యమైన 10 కిలోల మొదటి రకం టమాటా రూ. 310, 2వ రకం రూ. 280, 3వ రకం రూ. 230 తో అమ్ముడుపోయాయన్నారు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.