KRNL: టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కల్లుకుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సింగిల్ విండో చైర్మన్, క్లస్టర్ కో-ఇన్చార్జి కందనాతి నరసప్ప లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు దాసప్ప రెడ్డి, నరసప్ప, నరసింహులు, పంచాయతీ కార్యదర్శి శివకుమార్ గ్రామ ప్రజలు ఉన్నారు.