JGL: ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన పామాయిల్ సాగుచేసిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలంలోని కొత్తపేటలో అగ్ని ప్రమాదంలో పామాయిల్ పంట దగ్దం కాగా, సోమవారం జీవన్ రెడ్డి పరామర్శించారు. ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు డ్రిప్ సిస్టంను రిజిస్టర్ చేయాలని అన్నారు.