యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది మే నెలలో 29.90 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. సంఖ్యా పరంగా 2320 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. వేసవి ప్రయాణాలు, IPL సీజన్ కావడంతో యూపీఐ లావాదేవీలు పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది.