W.G: ప్రతీ పల్లెకు చక్కటి రహదారి నిర్మాణం చేపట్టి పల్లె ప్రగతికి కృషి చేస్తున్నట్టు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. మండలకేంద్రమైన పాలకోడేరు గ్రామంలో రూ. 26 లక్షల వ్యయంతో MGNREGS నిధులతో నిర్మించిన నూతన సీ.సీ.రోడ్డును సోమవారం ఆయన ప్రారంభించారు. కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.