AP: మెగా డీఎస్సీలో పారదర్శకత లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో నిరసనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దగా డీఎస్సీ నిర్వహించినందుకు లోకేష్ రాజీనామా చేయాలని, అవకతవకలపై సీఎం, లోకేష్ సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.