కృష్ణా: జిల్లా ఉంగుటూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని 40,521 మంది లబ్ధిదారులకు రూ.17.35 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.