VSP: జీవీఎంసీ 94వ వార్డు వేపగుంటలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ పింఛన్లు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.