కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాల పూర్వ విద్యార్థులు (2000-01) బ్యాచ్ 25 సంవత్సరాల తర్వాత ఒక్కచోట చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. రజతోత్సవ వేడుకలను తమకు విద్యాబుద్ధులు నేర్పిన, క్రమశిక్షణను అలవర్చిన ఉపాధ్యాయుల మధ్య సంతోషంగా, జరుపుకొన్నారు. తమ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన గురువులను సన్మానించారు.