ATP: ఆత్మకూరు మండలం సనప గ్రామంలో రూ.80 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.