NTR: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రెండో దశ రైతులకు కూటమి ప్రభుత్వం కౌలు నగదును జమ చేసింది. 7 గ్రామాలకు చెందిన రైతులకు ఎకరాకు రూ. 40 వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ కావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అటు తొలి విడతలో భూములిచ్చిన 29 గ్రామాల రైతులకు సైతం కౌలు నగదు అందింది.