NZB: నగరంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాస్థాన్ ప్రాంతంలో రెండు కార్లు ఢీకొన్నాయి. NZB నుంచి ఆర్మూర్ వైపు వెళ్తుండగా.. గంగాస్థాన్ వద్ద ఓ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో సతీశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అఖిల్ అనే వ్యక్తి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.