ADB: ఇచ్చొడ మండలంలోని గుండివాగు గ్రామ రహదారిపై రూ. 30 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. గుండివాగు గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.